![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -263 లో.. ముకుంద మాటలు గుర్తుచేసుకొని మురారి బాధపడుతుంటాడు. అప్పుడే రేవతి వచ్చి ఏంటి రా వర్షంలో తడిసావని అడుగుతుంది. ఏం లేదని చెప్పి మురారి మౌనంగా వెళ్లిపోతాడు. ఏమైంది మురారి డల్ గా ఉన్నాడు, కృష్ణతో ఏమైనా గొడవ అయిందా లేక ముకుంద ఏమైనా అందా అని రేవతి అనుకుంటుంది.
మరొక వైపు మురారి ఫొటోనే ముకుంద చూస్తుంటుంది. నీ ప్రేమ నాకే దక్కాలి. కృష్ణ మధ్యలో వచ్చింది, మధ్యలో వెళ్తుంది. నేను బ్లాక్ మెయిల్ చేస్తున్నానని నువ్వు అనుకుంటావ్ కానీ అది నీ మీద నాకున్న ప్రేమ అని ముకుంద అనుకుంటుంది. అప్పుడే అలేఖ్య ముకుంద దగ్గర వస్తుంది. మురారి తో మాట్లాడావా? ఏం అన్నాడని అలేఖ్య అడుగుతుంది. మాట్లాడాను కానీ తనకి నో అనే ఆప్షన్ నేను ఇవ్వలేదని ముకుంద అనగానే.. మరి ఇక ఆదర్శ్ రాడా అని అలేఖ్య అడుగుతుంది. వస్తాడు ఇంటికి, కానీ నా లైఫ్ లోకి కాదు అని ముకుంద అంటుంది. పెద్ద అత్తయ్య పెళ్లి కీ సపోర్ట్ చేస్తుంది ప్రేమకి కాదు. నువ్వు నీ ప్రేమ అంటూ నీ జీవితం కోల్పోతున్నావనిపిస్తుందని అలేఖ్య అనగానే.. నా జీవితం నా ప్రేమ కోసం, నా ప్రాణం త్యాగం చెయ్యడానికైనా సిద్ధంగా ఉన్నాను. అలాంటప్పుడు నాకు జీవితం కోల్పోవడమేంటి అలేఖ్య అని ముకుంద చెప్తుంది. మరొక వైపు ముకుంద, మురారి ఇద్దరు మాట్లాడుకున్నది కృష్ణ గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. అసలు ఇప్పుడు ఏం చెయ్యాలి నేను.. వెళ్ళిపోవాలా? ఉండాలా అని కృష్ణ అనుకుంటూ.. ఇలా ఎందుకు చేశారని ఎవరిని అడగాలని బాధపడుతుంటుంది.
ఆ తర్వాత కృష్ణ దగ్గరకి రేవతి వస్తుంది. కృష్ణ కూడా డల్ గా ఉండడం గమనించిన రేవతి.. అసలు వీళ్ళకి ఏమైందని అనుకుంటుంది. కృష్ణ డల్ గా ఉందని డైవర్ట్ చేయడానికి వంట చేద్దాం పదా అని రేవతి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత మురారితో మాట్లాడకుండా కృష్ణ వచ్చి నేలపై పడుకుంటుంది. మురారి మాట్లాడాలని ట్రై చేసిన కృష్ణ మాట్లాడదు. ఆ తర్వాత మరుసటి రోజు మురారికి కాఫీ తీసుకొని ముకుంద వస్తుంది. ఎవరైన చూస్తారు వెళ్లిపో అని మురారి అంటాడు. నువ్వు కాఫీ తాగితేనే వెళ్తానని ముకుంద అనగానే.. మురారి కాఫీ తాగుతాడు. కప్ లో చివరగా ఉన్నా కాఫీని ముకుంద తాగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |